AP Volunteer System Abolish:
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మకమైన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది.
ఏపీలో మొత్తం 2.5 లక్షల మంది వాలంటీర్లను 2019 సంవత్సరంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం నియామకం చేసిన సంగతి మనకు తెలిసింది 2024 సాధారణ ఎన్నికల సమయంలో అందులో 1,20,000 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగినది. ప్రస్తుతం 1.3 లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. వీరికి ఎటువంటి పని లేకుండా జీతం చెల్లిస్తున్నట్లు చాలామంది భావిస్తున్నారు.
ఈ రోజు అనగా 29 జూలై 2024 నా ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ సంచలనమైన తీర్మానం చేయడం జరిగినది AP Volunteer System Abolish(రద్దు) అలాగే ఒక నెల జీతాన్ని రాజధాని అమరావతికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది.
AP Volunteer System Abolish Update:
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు 16 డిమాండ్లతో వినతి పత్రం ఇవ్వనున్నట్లు పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తెలియజేయడం జరిగినది ఈ వివరాలన్నీ అఫీషియల్ గా రావడం జరిగింది.
వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం ఎంతవరకు సమంజసం అనేది చూడాల్సి ఉంది ప్రజల నుండి భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదివేల రూపాయల జీతం వాలంటీర్లకు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగినది ఇప్పుడు పంచాయతీరాజ్ సర్పంచుల సంఘం చేసిన తీర్మానాన్ని ప్రభుత్వం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు