Digital Lakshmi Scheme:
ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు భారీ శుభవార్త మరో పథకం రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సాధికారిక కోసం తీసుకురావడం జరిగింది. ఈ పథకం మీరు పొందాలంటే డ్వాక్రా సంఘం లో తప్పనిసరిగా ఉండాలి. మహిళలకు మరింత సాధికారత చేకూర్చేలా సూపర్ సిక్స్ లో లేని కొత్త పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం పేరే డిజిటల్ లక్ష్మి (Digital Lakshmi) ఈ పథకం ద్వారా ఇంటి వద్ద నుండి సంపాదించుకుని అవకాశం కల్పిస్తున్నారు.
ఇటువంటి Digital Lakshmi పథకాల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
Who is Eligible For this Scheme:
డ్వాక్రా సంఘంలో ఉండే మహిళ ఈ పథకానికి అర్హులు తప్పనిసరిగా డిగ్రీ చదువుకొని ఉండాలి అప్పుడే మీరు డిజిటల్ లక్ష్మి గా ఎంపిక అవుతారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం అందించే అనేక సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసే సమయంలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించడం తో పాటు మీసేవ లోని సేవలు అందించే అవకాశం కల్పిస్తారు.
ఈ డిజిటల్ లక్ష్మిగా నియమితులు అయిన వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేస్తారు అలాగే డిజిటల్ సేవలు అన్ని అందించాల్సి ఉంటుంది. తమ ఇంటి ముందు చిన్న రూమ్ లో ఈ కేంద్రం పెట్టుకోవచ్చు ఇది మీ సేవ తరహాలో ఉంటుంది. దీనికోసం బ్యాంకు నుంచి రెండు లక్షల రుణం కూడా ఇస్తారు. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
చదువుకున్న మహిళలకు అలాగే డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకు ప్రోత్సహించాలి వారికి ఆర్థిక చేయూత అందించాలి అని ఉద్దేశంతో ఈ పథకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో దరఖాస్తులు ప్రారంభం అవ్వడం జరిగింది త్వరలో అన్ని జిల్లాల్లో వీటికి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తారు.
దరఖాస్తు చేయడానికి SERP వారికి త్వరలో ఆదేశాలు వస్తాయి వారి నుండి డ్వాక్రా మహిళలకు సమాచారం చేర వేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు ఈ పథకం గురించి మరిన్ని వివరాలు త్వరలో మీకు అందజేయడం జరుగుతుంది.
ఇటువంటి Digital Lakshmi పథకాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
I want job