Free Current Scheme PMSMB:
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త 25 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ అందించే చాలా మంచి పథకాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ పథకం ద్వారా అర్హులైన వారికి సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి ‘పీఎం సూర్యాకర్ ముఫ్తీ బిజిలి యోజన’ (PMSMB) లబ్ది చేకూరుస్తారు. ఈ పథకానికి అందరూ పేదలు మరియు మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడానికి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది వీటికి కావాల్సిన అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఎప్పుడు తెలుసుకుందాం.
🔥ఏపీ అటవీ శాఖలో భారీగా ఉద్యోగ ఖాళీలు
ఈ పథకానికి సంబంధించి ముఖ్య విషయాలు:
- ఈ పథకం యొక్క పేరు ‘పీఎం సూర్యాకర్ ముఫ్తీ బిజిలి యోజన’ (PMSMB)
- కరెంటు బిల్లుల నుంచి విముక్తి పొందవచ్చు.
- అర్హులు అయిన వారికి ఇంటి పైకప్పు పైన సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తారు.
- దీని ద్వారా నా కుటుంబానికి 25 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ లభిస్తుంది.
- ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.
PMSMB పథకానికి అర్హులు ఎవరు:
- ‘పీఎం సూర్యాకర్ ముఫ్తీ బిజిలి యోజన’ ద్వారా మీరు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలంటే క్రింద తెలిపిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.
- 250 యూనిట్లు కంటే తక్కువ విద్యుత్ వినియోగించే కుటుంబాలు అర్హులు.
- కుటుంబానికి సంబంధించిన ఆదాయ పరిమితి రెండు లక్షల కన్నా లోపు ఉండాలి.
- EV చార్జింగ్ స్టేషన్లు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తు ఫీజు ఎంత చెల్లించాలి:
ఇందులో రెండు కిలో వాట్ మరియు మూడు కిలో వాట్ సోలార్ ప్యానల్స్ అందుబాటులో ఉంటాయి. మనకు కావాల్సిన కిలో వాట్ పెంచుకోవాలి.
- రెండు కిలో వాట్ల సోలార్ ప్యానల్ ఫీజు 1,10,000/- ఇందులో కేంద్ర ప్రభుత్వం 60,000 సబ్సిడీ ఇస్తుంది.
- రాష్ట్ర ప్రభుత్వం 20,000 సబ్సిడీ ఇస్తుంది.
- లబ్ధిదారులు 30,000 చెల్లిస్తే చాలు.
🔥ఏపీ లో వీరికి రేషన్ కార్డులు రద్దు
పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి:
PMSMB దరఖాస్తు చేయడానికి విద్యుత్ శాఖ వారికి సంప్రదించవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంది. దీనికోసం ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, ఇంటి పట్టా పత్రాలు అవసరం ఉంటాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు వచ్చి పరిశీలించి ఆమోదం ముద్ర వేస్తారు. ఆన్లైన్ దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది అర్హులు దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి ఉచిత విద్యుత్ పథకాల సమాచారం రోజు పొందాలంటే మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “PMSMB Yojana: AP లో 25 సంవత్సరాలు ఉచిత విద్యుత్ ఇచ్చే పథకం”