ISRO SHAR Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (ISRO – SHAR) లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో లైబ్రరీ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఇంజనీర్, ఫైర్ మెన్, కుక్, నర్స్ మొదలైన పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు పరిశీలించి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టండి.
ఇటువంటి ISRO ప్రభుత్వ ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఇచ్చిన గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥ఏపి లో 10 వ తరగతి అర్హత జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 16 అక్టోబర్ 2025 నుండి 14 నవంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ISRO శ్రీహరికోట సంస్థ నుండి విడుదల కావడం జరిగింది ఇందులో మొత్తం 141 పోస్టులు ఉన్నాయి పోస్టులు వివరాలు. లైబ్రరీ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఇంజనీర్, ఫైర్ మెన్, కుక్, నర్స్ మొదలైన ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు 10వ తరగతి, ఇంటర్, ITI, డిగ్రీ, బీటెక్ చేసినవారు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం పోస్టుల వారీగా 30,845 నుండి 86,955/- వరకు లభిస్తుంది ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అర్హత అనుసరించి పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 750 రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు 500 రూపాయలు చెల్లిస్తే చాలు ఫీజు నుండి ఎవరికి మినహాయింపు లేదు.

దరఖాస్తు విధానం:
అధికారిక వెబ్సైట్ క్రింది ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించిన తర్వాత అభ్యర్థులు 14 నవంబర్ 2025 లోపు ఆన్లైన్లో మీ వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి ISRO ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “ISRO శ్రీహరికోట లో ఉద్యోగాలు | ISRO SHAR Recruitment 2025”