KGBV Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ మరియు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (KGBV) ఆధ్వర్యంలో నాన్ టీచింగ్ 1095 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు కేవలం 10 వ తరగతి, ఏదైనా డిగ్రీ, B. Ed/ MA అర్హత ఉంటే చాలు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, అకౌంటెంట్, ANM, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, అటెండర్, నైట్ వాచ్మెన్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింద వివరించడం జరిగింది. తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి KGBV ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥SVIMS లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 3 జనవరి 2026 నుండి 11 జనవరి 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ KGBV వారు విడుదల చేశారు ఇందులో వివిధ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, అకౌంటెంట్, ANM, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, అటెండర్, నైట్ వాచ్మెన్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి కేవలం 10 వ తరగతి, ఏదైనా డిగ్రీ, B. Ed/ MA అర్హత ఉంటే చాలు పోస్టులు అనుసరించి విద్యా అర్హత ఉంటుంది.
జీతం వివరాలు:
పోస్టు అనుసరించి 15,000/- నుండి 60,000/- వరకు జీతం రావడం జరుగుతుంది ఇక ఎటువంటి అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం విద్యా అర్హత మరియు మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారాన్ని పరిశీలించి అర్హత ఉన్న అభ్యర్థులు 11 జనవరి 2026 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.
ఇటువంటి KGBV ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “KGBV Jobs 2025: పరీక్ష, ఫీజు లేదు 10 అర్హత తో 1095 ఉద్యోగాలు భర్తీ”