Ration Card Latest News:
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 7 రకాల Ration Card సర్వీసులు ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే ప్రస్తుతం ప్రభుత్వం వాట్సాప్ మిత్ర ద్వారా 9552300009 నెంబర్ కు మెసేజ్ చేసి కొత్త రైస్ కార్డు, రైస్ కార్డు విభజన, రేషన్ కార్డ్ అడ్రస్ మార్పు, కుటుంబ సభ్యులు చేర్పులు, తొలగింపు, కార్డు సరెండర్ వంటి వాటికి అవకాశం ఈరోజు నుండి కల్పించడం జరిగింది అలాగే పెళ్లయిన వారు పాత రేషన్ కార్డు నుండి విడిపోయి కొత్త దానికి దరఖాస్తు చేయడానికి మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వివరించారు.
ఇటువంటి Ration Card సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥తల్లికి వందనం పథకం ఈరోజున వేస్తారు
Ration Card Without Marriage Certificate:
చాలామంది కొత్త రేషన్ కార్డు భార్య భర్తలు చేసుకోవడానికి గ్రామ మరియు వార్డు సచివాలయం సందర్శిస్తున్నారు. అక్కడ వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలని ఆప్షన్ ప్రకారం సచివాలయ సిబ్బంది అడుగుతున్నారు ప్రస్తుతం ప్రభుత్వం పాత కార్డు నుండి విడిపోయి కొత్త కార్డు చేసుకునే వారికి ఈ సర్టిఫికెట్ లేకుండానే జారీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భార్యను తన కార్డులో కలపడానికి మాత్రం మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి కేవలం కార్డు నుండి విడిపోయి కొత్త కార్డు కు మాత్రమే అవకాశం ఇచ్చారు.
How to Apply an AP Ration Card in WhatsApp.?
వాట్సప్ లో రేషన్ కార్డు దరఖాస్తు కొరకు ముందుగా 9552300009 నంబర్ మీ మొబైల్ లో సేవ్ చేయాలి ఆ తర్వాత పై తెలిపిన నెంబర్ కు వాట్సప్ ద్వారా Hi అని మెసేజ్ చేయగానే మీకు ఈ సేవలకు సంబంధించిన సమాచారం రావడం జరుగుతుంది. అక్కడ మీకు కావాల్సిన సేవలను మీరు వినియోగించుకోవచ్చు.
ఇటువంటి రేషన్ కార్డు సమాచారం రోజూ పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.