Telangana Court Jobs 2025:
తెలంగాణ జిల్లా కోర్టు మరియు హైకోర్టు నందు ఖాళీగా ఉన్న 1673 టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది అన్ని అర్హతలకు ఇందులో ఉద్యోగాలు ఉన్నాయి వయస్సు 18 నుండి 34 సంవత్సరాల మధ్య ఉండాలి నోటిఫికేషన్స్ సంబంధించి అర్హత, ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ తెలంగాణ హైకోర్టు వారు విడుదల చేయడం జరిగింది 33 జిల్లా కోర్టులు మరియు హైకోర్టులో ఖాళీగా ఉన్న 1673 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా 1277 జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ లాంటి నాన్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి అలాగే 184 స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీస్ట్ లాంటి పోస్టులు భర్తీ చేస్తారు.
🔥APPSC జాబ్స్ క్యాలెండర్ 2686 పోస్టులు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 8 జనవరి 2025 నుండి 31 జనవరి 20 వరకు అవకాశం కల్పించారు. వీటికి సంబంధించిన రాత పరీక్ష ఏప్రిల్ నుండి జూన్ వరకు నిర్వహించే అవకాశం ఉంది.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 34 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
🔥AP సంక్షేమ శాఖ 266 పోస్టులు భర్తీ
జీతం:
ఈ తెలంగాణ Court ఉద్యోగాలకు పోస్టుల వారీగా జీతం 30,000/- నుండి 45,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు పూర్తి వివరాలు నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడగలరు.
దరఖాస్తు రుసుము:
నోటిఫికేషన్ వారీగా దరఖాస్తు చేయడానికి 600/- ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు 400/-
🔥ఏపీ అటవీ శాఖలో 691 పోస్టులు భర్తీ
దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి ప్రస్తుతం నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ విడుదల కావడం జరిగింది పూర్తి సమాచారం కింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి తెలంగాణ Court ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “జిల్లా కోర్టులో 1673 పోస్టులు భర్తీ | TG Court Jobs 2025 | Telangana Court Jobs 2025”