AP School Holidays: ఆంధ్రప్రదేశ్ లో 20, 21 ఈ జిల్లాలో పాఠశాలలు సెలవు

AP School Holidays:

ఆంధ్రప్రదేశ్ లో జూన్ 20, 21 పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఏ జిల్లాలో సెలవు ఉంటుంది ఏం చేయాలి అనే పూర్తి వివరాలు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనెల 21 న విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో యోగ ఇంటర్నేషనల్ డే నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ప్రభుత్వం విశాఖపట్నం జిల్లా నందు సెలవులు ప్రకటించడం జరిగింది. సెలవు ప్రకటించిన కూడా ఉదయం 7 గంటల నుండి 8 వరకు ఈ పాఠశాలల్లో యోగా నిర్వహించాలి ఆ తర్వాత సెలవు ఉంటుంది. ఇది అన్ని జిల్లాలకు వర్తిస్తుందా అంటే కేవలం ఒక విశాఖపట్నం జిల్లాలో మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

విశాఖపట్నంలో జూన్ 21 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగాంధ్ర కార్యక్రమానికి హాజరవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి పాఠశాలలకు ఈ జిల్లాలో సెలవు ఇచ్చారు. ఇతర అన్ని జిల్లా పాఠశాలల్లో జూన్ 21 న యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాలి. ఆ తర్వాత ఏదైనా సెలవు ప్రకటిస్తారా అనేది ప్రభుత్వం ఈరోజు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది. విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో యోగాసనాలు వేసి గిన్నిస్ రికార్డు సృష్టించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఏ జిల్లాలో AP School సెలవు ప్రకటించారు..?

కేవలం ఒక విశాఖపట్నం జిల్లాలో మాత్రమే మీ సెలవులు ప్రకటించడం జరిగింది కావున అక్కడ విద్యార్థులు దీనిని గమనించి పాఠశాలకు హాజరు అవ్వండి. ఇతర అన్ని జిల్లాల్లో యధావిధిగా పాఠశాలలో జరుగుతాయి ఏదైనా ఇతర సమాచారం లభించిన వెంటనే మీకు అందించడం జరుగుతుంది.

AP School Holidays

Join WhatsApp Group 

ఇటువంటి AP School సెలవుల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP School Holidays: ఆంధ్రప్రదేశ్ లో 20, 21 ఈ జిల్లాలో పాఠశాలలు సెలవు”

Leave a Comment

error: Content is protected !!