NIB Assistant Jobs 2026:
నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు NIB వారు విడుదల చేశారు ఇందులో 44 పోస్టులు ఉన్నాయి. భర్తీ చేసే పోస్టులు సైంటిస్ట్ గ్రేడ్ 2, జూనియర్ సైంటిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, హిందీ ట్రాన్స్లేటర్, ల్యాబోరేటరీ అసిస్టెంట్, మొదలైన పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు వయస్సు ఉండాలి. 10+2, డిగ్రీ మొదలైన అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది. తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
ఇటువంటి NIB ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ లో పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥KVS లో భారీగా ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 9 మార్చి 2026 నుండి 8 ఏప్రిల్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్ (NIB) వారు విడుదల చేశారు ఇందులో వివిధ సైంటిస్ట్ గ్రేడ్ 2, జూనియర్ సైంటిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, హిందీ ట్రాన్స్లేటర్, ల్యాబోరేటరీ అసిస్టెంట్, మొదలైన పోస్టులు 44 ఉన్నాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు 12th, ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు అర్హత ఉంటే నేరుగా దరఖాస్తు సమర్పించవచ్చు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.
ఎంపిక విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధిస్తే ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని 14 ఏప్రిల్ 2026 సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు మీ అప్లికేషన్ నోటిఫికేషన్ లో తెలిపిన చిరునామాకు పంపించండి.
ఇటువంటి NIB ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
