BSNL Telecom Officer Jobs 2026:
భారత సంచార నిగం లిమిటెడ్ (BSNL) టెలికాం విభాగంలో జూనియర్ టెలికాం ఆఫీసర్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు జూలై మూడవ తేదీ వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం ఇచ్చారు మొత్తం 100 పోస్టులు ఇందులో ఉన్నాయి బిటెక్ మరియు ఎంటెక్ అర్హతలకు ఉద్యోగాలు భర్తీ చేస్తారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించండి.
ఇటువంటి BSNL ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥KGBV ల్లో భారీగా ఏపీ లో జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 4 జూన్ 2026 నుండి 3 జూలై 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా భారత్ సంచార నిగం లిమిటెడ్ (BSNL) వారు విడుదల చేశారు ఇందులో 100 జూనియర్ టెలికాం ఆఫీసర్ ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ సమానమైన అర్హతలు ఉన్నవారు అర్హులు ముఖ్యంగా టెలి కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, రేడియో, కంప్యూటర్, ఎలక్ట్రికల్, IT, MSC చేసిన వారు కూడా దరఖాస్తు చేయవచ్చు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 20 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
JTO పోస్టులకు మీరు ఎంపిక అయితే మొదటి నెల నుండి బేసిక్ పే 16,400 నుండి 40,500/- వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి మొదటి నెల నుండి జీతం 35,000/- ఉంటుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఎంపికైన వారికి డాక్యుమెంట్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి UR/ OBC/ EWS అభ్యర్థులకు 2000 రూపాయలు ఫీజు SC/ST/ PWD అభ్యర్థులు 1000 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు మూడు జూలై 2026 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించండి.
ఇటువంటి BSNL ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
