AP NTR Bharosa Pensions 2026 Application Date:
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారీ శుభవార్త.. ఎంతగానో ఎదురు చూస్తున్నా సమాచారం రావడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా AP లో కొత్త పెన్షన్లు మంజూరు కొరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మూడు లక్షల మందికి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంట్లో మొదటగా వితంతువులు మరియు వృద్ధులకు అవకాశం కల్పిస్తారు ఆ తర్వాత విడతల వారీగా దివ్యాంగుల ద్వారా దరఖాస్తుల స్వీకరించి పెన్షన్ కేటాయింపు జరుగుతుంది వీటికి సంబంధించి దరఖాస్తులు ఎప్పుడు స్వీకరిస్తారు ఎలా దరఖాస్తు చేయాలి అనే సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి AP ప్రభుత్వ పథకాల సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా చేయడం అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా దరఖాస్తు చేయడానికి సెప్టెంబర్ నుండి దరఖాస్తులు స్వీకరిస్తారని సమాచారం రావడం జరిగింది వీరికి అక్టోబర్ నుంచి పెన్షన్ పంపిణీ ఉంటుంది.
పెన్షన్ మంజూరు పూర్తి సమాచారం:
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయిన సమయం నుండి ఇప్పటివరకు కొత్త పెన్షన్ దరఖాస్తులు స్వీకరించలేదు వీటికి సంబంధించి మూడు లక్షల వరకు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మొదటి విడతలో వితంతువులు మరియు వృద్ధులకు సెప్టెంబర్ రెండో వారం నుంచి దరఖాస్తుల స్వీకరించి అర్హులైన వారికి అక్టోబర్ నెల నుంచి పెన్షన్ మంజూరు చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (AP SERP) నిర్ణయం తీసుకోవడం జరిగింది వీరు 1.7 లక్షల మంది ఉండే అవకాశం ఉంది తాజాగా తీసిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ప్రభుత్వ పెన్షన్ ఎంతమంది అర్హులు ఉన్నారో గుర్తిస్తామని తెలియజేశారు.

మొదటగా వీరికి ప్రాధాన్యం ఇచ్చిన తర్వాత విడతలవాదిరిగా దివ్యాంగులకు పెన్షన్ మంజూరు చేసే అవకాశం ఉంది అలాగే చేనేత, గీత కార్మికులు, తప్పు కళాకారులు, చర్మకారులు వీరికి కూడా పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది వీరు 60 వేల నుండి 70 వేల వరకు ఉండే అవకాశం ఉంది. అలాగే సదరం సర్టిఫికెట్ జారీ అయిన సందర్భంలో చాలా అవకతవకలు జరిగాయని వాటిని ఎలా పరిశీలించాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దివ్యాంగులకు కూడా కొత్త పెన్షన్లు చివరి విడుదల భాగంగా ఇస్తారు తాజాగా ఈ సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. కొత్త పెన్షన్ కొరకు మీ గ్రామ మరియు వార్డు సచివాలయంలో త్వరలో దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఇటువంటి AP ప్రభుత్వ పథకాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
