AP Collector Office Recruitment 2026:
ఆంధ్రప్రదేశ్ లోని Collector ఆఫీస్ లో వివిధ శాఖలో ఖాళీగా ఉన్న విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. దరఖాస్తు చేయడానికి 14 మే 2026 సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది కావున అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని కలెక్టర్ ఆఫీస్ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతుల కౌంటర్ నందు దరఖాస్తు సమర్పించాలి.
ఇటువంటి AP Collector Office ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 6 మే 2026 నుండి 14 మే 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ వారు విడుదల చేశారు ఇందులో విభిన్న ప్రతిభావంతుల కొరకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ మరియు జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి వివిధ శాఖల ఉద్యోగాలకు వివిధ అప్లికేషన్ ఫారం సమర్పించవచ్చు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 50 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు.
విద్యా అర్హత:
పోస్టులు అనుసరించి 7 వ తరగతి, 10వ తరగతి, మరియు డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా ప్రతిభావంతుల జాబితాలో మీరు అర్హులు అయితే దరఖాస్తు సమర్పించవచ్చు.
జీతం వివరాలు:
మీరు ఈ Collector ఆఫీస్ ఉద్యోగానికి ఎంపికైతే ఉద్యోగాలు అనుసరించి 25,000/- నుండి 60,0000/- వరకు జీతం రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి ఇవి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న వారికి ఎటువంటి పరీక్ష లేదు విద్యా అర్హత, అనుభవం, ప్రతిభ వంతుల జాబితా అనుసరించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి అప్లికేషన్ కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలి దరఖాస్తు చేయడానికి 14 మే 2026 సాయంత్రం 5 గంటల వరకు ఇవ్వాలి.
ఇటువంటి AP Collector Office ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
