APPSC ASO Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ లో పెర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి APPSC వారు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో 196 ఖాళీలు ఉన్నాయి సొంత జిల్లాలో పనిచేసే మంచి అవకాశం ఈ ఉద్యోగం మీకు లభిస్తే మొదటి నెల నుండి జీతం 52,000 వరకు రావడం జరుగుతుంది. చాలా రోజుల తర్వాత ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
ఇటువంటి ASO ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP పోలీస్ శాఖలో కొత్త ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 13 అక్టోబర్ 2026 నుండి రెండు నవంబర్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో విడుదల చేశారు ఇందులో 196 ASO ఖాళీలు భర్తీ చేస్తున్నారు కేవలం విద్యా అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
విద్యా అర్హత:
కింది అర్హత ల్లో ఏదైనా ఒక డిగ్రీ కలిగి ఉండాలి
i) ఒక ముఖ్య సబ్జెక్ట్ గా (Main Subject) స్టాటిస్టిక్స్ (Statistics) తో బ్యాచిలర్స్ డిగ్రీ (B.A / B.Sc).
లేదా
ii) ఒక ముఖ్య సబ్జెక్ట్ గా మాథెమాటిక్స్ (Mathematics) తో బ్యాచిలర్స్ డిగ్రీ (అందులో ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు లేదా మూడేళ్ళలో ఏదో ఒక సమయంలో స్టాటిస్టిక్స్ ఒక పేపర్ గా చదివి ఉండాలి).
లేదా
iii) ఒక ముఖ్య సబ్జెక్ట్ గా ఎకనామిక్స్ (Economics) తో బ్యాచిలర్స్ డిగ్రీ (అందులో ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు లేదా మూడేళ్ళలో ఏదో ఒక సమయంలో స్టాటిస్టిక్స్ ఒక పేపర్ గా చదివి ఉండాలి).
లేదా
iv) ఒక ముఖ్య సబ్జెక్ట్ గా కామర్స్ (Commerce) తో బ్యాచిలర్స్ డిగ్రీ (అందులో ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు లేదా మూడేళ్ళలో ఏదో ఒక సమయంలో స్టాటిస్టిక్స్ ఒక పేపర్ గా చదివి ఉండాలి).
లేదా
v) ఒక ముఖ్య సబ్జెక్ట్ గా కంప్యూటర్ సైన్స్ (Computer Science) తో బ్యాచిలర్స్ డిగ్రీ (అందులో ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు లేదా మూడేళ్ళలో ఏదో ఒక సమయంలో స్టాటిస్టిక్స్ ఒక పేపర్ గా చదివి ఉండాలి).
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 44 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
ఎంపిక విధానం:
మొదట ఒక పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులతో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఉన్న అభ్యర్థులకు డాక్యుమెంట్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే జీతం 37,640/- నుండి 1,15,500/- వరకు ఉంటుంది మొదటి నెల నుండి మీరు జీతం 52,000 వరకు అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి వస్తాయి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి 250 రూపాయలు ఫీజు చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు విధానం:
అధికారిక APPSC ద్వారా 13 అక్టోబర్ 2026 నుండి దరఖాస్తు చేయడానికి అవకాశం ఇచ్చారు అర్హులు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ లింక్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి APPSC ASO ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
