BHEL Recruitment 2025:
ప్రభుత్వ విద్యుత్ శాఖ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(BHEL) నుండి 417 పోస్టులతో ఇంజనీర్ ట్రైనీ మరియు సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, మెటలర్జీ విభాగం అభ్యర్థులకు ఉద్యోగాలు ఉన్నాయి. 18 నుండి 27 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేయుటకు అర్హులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి BHEL ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥అమెరికన్ ఎక్సప్రెస్ లో ఇంటి నుండి పని
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 1 ఫిబ్రవరి 2025 ప్రారంభమై 28 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం ఇచ్చారు. రాత పరీక్ష ఏప్రిల్ 11 నుండి 13 వరకు నిర్వహిస్తారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(BHEL) వారు విడుదల చేశారు ఇందులో 417 ట్రైనీ ఇంజనీర్ మరియు సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి.
🔥రైల్వే గ్రూప్ D బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, మెటలర్జీ వారు అర్హులు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 27 సంవత్సరాలు వయసు ఉన్నవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
🔥సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే ఇది పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి నెల నుండి అన్ని అలవెన్స్ మరియు బెనిఫిట్స్ కలిపి 85,000/- వరకు జీతం రావడం జరుగుతుంది.
కావాల్సిన సర్టిఫికెట్:
దరఖాస్తు చేయడానికి క్రింద తెలిపిన పత్రాలు అన్ని సిద్ధంగా ఉంచుకోండి.
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
- సిగ్నేచర్ స్కాన్ కాపీ
- విద్యా అర్హత సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రం
🔥అమెజాన్ లో ఇంటి నుండి పని చేయాలి
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
దరఖాస్తు విధానం:
1 ఫిబ్రవరి 2025 నుండి ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి ప్రస్తుతం విడుదలైన షార్ట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది.
ఇటువంటి BHEL ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “విద్యుత్ శాఖ BHEL లో 417 ట్రైనీ ఉద్యోగాలు | BHEL Recruitment 2025 | Latest Jobs in Telugu ”