Telangana Outsourcing Jobs 2024:
Telangana రాష్ట్రంలోని వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన కరీంనగర్ మెడికల్ కాలేజి నందు అవుట్ సోర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది పదవ తరగతి అర్హత తో కూడా ఉద్యోగాలు ఉన్నాయి పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి
🔥AP లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Telangana వైద్య మరియు ఆరోగ్య శాఖ వారు కరీంనగర్ మెడికల్ కాలేజ్ నందు ఖాళీగా ఉన్న ల్యాబ్ అటెండర్, స్టోర్ కీపర్, ఈసీజీ టెక్నీషియన్, సిటీ స్కాన్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, థియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
పోస్టులను అనుసరించి ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే 10th / 10+2 / MLT/ డిగ్రీ అర్హత ఉన్న వారు దరఖాస్తు చేయడానికి అర్హులు.
🔥గ్రామీణ పశు సంవర్తక శాఖలో ఉద్యోగాలు
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 44 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయసు సడలింపు ఇచ్చారు.
జీతం:
పోస్టుల భారీగా జీతం కింద తెలిపిన విధంగా ఇస్తారు
- ల్యాబ్ అటెండర్ పోస్టులకు 15,600/-
- స్టోర్ కీపర్, రికార్డు క్లర్క్, రికార్డు అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రిషన్, ప్లంబర్, థియేటర్ అసిస్టెంట్ పోస్టులకు 19500/-
- ఈసీజీ టెక్నీషియన్, సిటీస్కాన్ టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్ 22,750/-
- గ్యాస్ ఆపరేటర్ పోస్టులకు జీతం 15600 చెల్లిస్తారు
ముఖ్యమైన తేదీలు:
ఈ Telangana అవుట్ సోర్సింగ్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 20 నవంబర్ 2024 వరకు సమయం ఇవ్వడం జరిగింది. వయస్సు, విద్యా అర్హత నిర్ధారణ కొరకు 11 నవంబర్ 2024 కటాఫ్ తేదగా నిర్ణయించారు.
🔥అటవీ శాఖలో సూపర్ నోటిఫికేషన్ వచ్చేసింది
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం విద్యా అర్హతలోని మెరిట్ మార్కుల ఆధారంగా జాబితా విడుదల చేసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసిన తర్వాత అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని Offline విధానంలో క్రింద తెల్లిపిన చిరునామా నందు 20 నవంబర్ లోపు దరఖాస్తు చేయండి.
దరఖాస్తు చిరునామా: జిల్లా పరిశ్రమల కేంద్రము, పద్మా నగర్, కరీంనగర్, వారధి సొసైటీ కార్యాలయం నందు అప్లికేషన్ ఫారం బయోడేటా సమర్పించండి.
ఇటువంటి Telangana ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి
3 thoughts on “మెడికల్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | Telangana Outsourcing Jobs 2024 | Telangana Health Department Jobs 2024”