IDBI Junior Assistant Jobs 2025:
IDBI బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు కేవలం డిగ్రీ అర్హతతో ఒకటే ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు ఎంపికైన వారికి ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తారు. ఉద్యోగం వచ్చిన వెంటనే మీకు జీతం 6.5 లక్షలు ప్రతి సంవత్సరం చెల్లిస్తారు చాలా మంచి అవకాశం నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి IDBI ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 1 మార్చి 2025 నుండి 12 మార్చి 2025 వరకు అవకాశం కల్పించారు ఆన్లైన్ పరీక్ష 6 ఏప్రిల్ 2025 నిర్వహిస్తారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ IDBI బ్యాంకు వారు విడుదల చేశారు ఇందులో 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
1 మార్చి 2025 నాటికి డిగ్రీ ఏదైనా సబ్జెక్టులో పూర్తి చేసిన వారు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు తెలుగు మాట్లాడటం చదవడం తెలిసి ఉండాలి.
🔥SBI లో గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 20 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు 250/- రూపాయలు ఫీజు మిగిలిన అందరూ అభ్యర్థులు 1050/- రూపాయలు చెల్లించాలి.
🔥పార్ట్ టైం ఇంటి నుండి పని చేసే జాబ్స్
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 6 ఏప్రిల్ ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు ఎంపికైన వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తారు.
ట్రైనింగ్ వివరాలు:
ఈ పోస్టుకు మీరు ఎంపిక అయితే ఒక సంవత్సరం పాటు మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా బ్యాంకింగ్ రంగంలో ట్రైనింగ్ ఉంటుంది ఆరు నెలలు క్లాస్ రూమ్ లో మరియు బ్యాంకులో ఆరు నెలలు ఇస్తారు ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టు కల్పిస్తారు.
జీతం వివరాలు:
ట్రైనింగ్ పూర్తి చేసి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం పొందిన వారికి 6.5 లక్షల వార్షిక జీతం చెల్లిస్తారు అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు విధానం:
12 మార్చ్ లోపు ఆన్లైన్ ద్వారా పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది.
ఇటువంటి IDBI ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “IDBI బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ | IDBI Junior Assistant Jobs 2025 | Latest Jobs Telugu”