Railway ALP Jobs 2026:
భారత రైల్వే మంత్రిత్వ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఖాళీలు ఇందులో ఉన్నాయి మొత్తం 11,127 పోస్టులు భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు చేయడానికి 15 మే 2026 నుండి 14 జూన్ 2026 వరకు అవకాశం కల్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు సొంత జిల్లాలో పనిచేసే మంచి అవకాశం ఇందులో లభిస్తుంది. ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 45,000/- వరకు రావడం జరుగుతుంది నోటిఫికేషన్స్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి Railway ALP ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ ద్వారా పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపి లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 15 మే 2026 నుండి 14 జూన్ 2026 వరకు ఆన్లైన్ ద్వారా అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) వారు విడుదల చేశారు ఇందులో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) సంబంధించి 11,127 ఖాళీలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా విద్యా అర్హత ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు గుర్తింపు పొందిన సంస్థల నుండి పదవ తరగతి తర్వాత ఫిట్టర్, మెకానిక్ లేదా డిప్లొమా అనేది మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలెక్ట్రానిక్, ఆటోమొబైల్ అర్హత ఉండాలి పైన తెలిపిన అర్హతలు బీటెక్ చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయగలరు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే బేసిక్ పే 19,900/- నుండి 63,200/- వరకు జీతం రావడం జరుగుతుంది. ఉద్యోగంలో చేరిన వెంటనే జీతం 45,000/- వరకు రావడం జరుగుతుంది.
వయస్సు:
14 జూన్ 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి. రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 500/- రూపాయలు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు ట్రాన్స్ జెండర్ మరియు మైనారిటీలు ఫీజు 250/- చెల్లిస్తే చాలు.
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత రెండు పరీక్షలు నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ మరియు మెడికల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని 14 జూన్ 2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి RRB ALP ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
