SSC Recruitment 2026: 10, 12, ఏదయినా డిగ్రీ అర్హత తో ఈ ఏడాది వచ్చిన బెస్ట్ జాబ్ నోటిఫికేషన్ 

SSC Recruitment 2026:

నిరుద్యోగులకు భారీ శుభవార్త.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న 3003 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇటువంటి అనుభవం అవసరం లేకుండా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, ల్యాబోరేటరీ అటెండర్, జూనియర్ ఇంజనీర్, ల్యాబోరేటరీ అసిస్టెంట్, అకౌంటెంట్, స్టోర్ అటెండర్, లైబ్రరీ అటెండర్, టెక్నికల్ అసిస్టెంట్ మరియు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీలకు SSC వారు ఫేజ్ XIV ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే తప్పకుండా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి DSC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥ఇంటర్ అర్హత తో భారీగా ఉద్యోగాలు

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 13 ఏప్రిల్ 2026 నుండి 4 మే 2026 వరకు అవకాశం కల్పించడం జరిగింది వీటికి సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష జూన్ 2026 నిర్వహిస్తారని అధికారికంగా తెలియజేశారు.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విడుదల కావడం జరిగింది. వీటిని SSC ఫేజ్ XIV లో భాగంగా 3003 ఖాళీలు పోస్టుల వివరాలు చూసుకుంటే 382 డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, ల్యాబోరేటరీ అటెండర్, జూనియర్ ఇంజనీర్, ల్యాబోరేటరీ అసిస్టెంట్, అకౌంటెంట్, స్టోర్ అటెండర్, లైబ్రరీ అటెండర్, టెక్నికల్ అసిస్టెంట్ మరియు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి పోస్టులు అనుసరించి 10, 10+2, ఇంటర్ మరియు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు సమర్పించవచ్చు.

వయస్సు:

దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.

జీతం వివరాలు: 

పోస్టులు అనుసరించి 35,400/- నుండి 1,12,400/- వరకు జీతం రావడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి ఇవి పెర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు.

దరఖాస్తు ఫీజు: 

దరఖాస్తు చేయడానికి వంద రూపాయలు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి. మహిళలు, SC, ST మరియు దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా అప్లికేషన్ సమర్పించవచ్చు.

ఎంపిక విధానం: 

మొదట కంప్యూటర్ బేస్ లో పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ లేదా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

SSC Recruitment 2026

దరఖాస్తు విధానం: 

నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే తప్పనిసరిగా ఆన్లైన్లో మీ అప్లికేషన్ 4 మే 2026 లోపు సమర్పించండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి DSC ఉద్యోగ సమాచారం రోజూ పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!