Postal GDS Notification 2025:
కేవలం పదవ తరగతి పాస్ అర్హతతో 40 వేల Postal GDS ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ ఉద్యోగాలు రెండు సార్లు విడుదల చేస్తారు ప్రస్తుతం మొదటి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఇందులో వివిధ కారణాలవల్ల 2024 లో ఏర్పడిన ఖాళీలు మరియు 2024 జూలై నోటిఫికేషన్ లో మిగిలిన పోస్టులు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు వాటికి సంబంధించి నోటీస్ రావడం జరిగింది.
ఇటువంటి Postal GDS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఎయిర్ పోర్టులో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల తేదీ 29 జనవరి 2025
- నోటిఫికేషన్ దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 28
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ పోస్టల్ శాఖ వారు Indiapostgdsonline.gov.in వెబ్సైట్ లో విడుదల చేస్తారు. ఇందులో మొత్తం 40 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి కేవలం పదవ తరగతి అర్హత చాలు తెలుగు మాట్లాడటం చదవడం వచ్చి ఉండాలి.
🔥రైల్వే శాఖలో భారీగా MTS ఉద్యోగాలు
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు వయసు ఉన్నవారు అర్హులు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు ఎంపిక అయితే జీతం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కు 15,000/- అలాగే డాక్ సేవక్ పోస్టులకు 12,000/- నుండి జీతం మొదలవుతుంది.
🔥NIT లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ
పరీక్ష విధానం:
ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం పదవ తరగతి విద్య అర్హత లోని మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు 100/- రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ముఖ్యమైన వివరాలు:
దరఖాస్తు చేయుటకు పూర్తి నోటిఫికేషన్ 29 జనవరి 2025 విడుదల చేస్తారు అందులో రాష్ట్రాల వారీగా సర్కిల్స్ వారీగా ఖాళీల వివరాలు తెలుస్తాయి.
🔥కోల్ ఇండియా సంస్థలో భారీగా ఉద్యోగాలు
దరఖాస్తు విధానం:
ఆన్లైన్లో ఫీజు చెల్లించి https://Indiapostgdsonline.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి పూర్తి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం విడుదలైన నోటీసు వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
Postal GDS ఉద్యోగ నోటిఫికేషన్ కొరకు రోజు మన వెబ్సైట్ JobsGuruvu.com సందర్శించండి.
I’m accepted