AP Mega DSC 2025:
ఆంధ్రప్రదేశ్ లో DSC అభ్యర్థులు నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుంది అని ఎదురుచూస్తున్నారు నోటిఫికేషన్ విడుదలలో తీవ్రమైన జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం రావడం జరిగింది. ముందుగా ప్రకటించిన విధంగా నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే విద్యా సంవత్సరం మొదలు అయ్యే లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది వాటికి సంబంధించిన పూర్తి సమాచారం పరిశీలిస్తే.
ఇటువంటి AP DSC సమాచారం రోజు మీ వాట్సప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP ఉపాధి ఆఫీస్ ద్వారా 1075 జాబ్స్
మెగా DSC నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు..?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు వాటికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం జరిగింది. ఈ ఎన్నికలు మార్చ్ మొదటి వారంలో పూర్తి కానుంది. ఆ తర్వాత మార్చి రెండో వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ వచ్చిన నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో కొంత ఆలస్యం జరిగిన ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తారు.
🔥TCS సంస్థలో భారీ జాబ్ మేళ నిర్వహిస్తున్నారు.
మార్చి 15 వ తేదీ తర్వాత DSC నోటిఫికేషన్ విడుదల చేసి వాటికి సంబంధించిన పరీక్షలను మే నెలలో నిర్వహించి జూన్ లేదా జూలై నెలలో పోస్టింగ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. జూన్ 12వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 16 వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే ఆ తేదీలోపు నోటిఫికేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
🔥APSFL లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు
ఎందుకు ఆలస్యం అయ్యింది..?
నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల చేసి పరీక్షలు నిర్వహించి నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది కానీ ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆలస్యం అవ్వడం జరిగింది. కమిషన్ పదవీ కాలాన్ని ప్రభుత్వం మార్చ్ 11 వరకు పొడిగించడం జరిగింది అయిన 15 ఫిబ్రవరి వరకు పూర్తి చేసి కమిషన్ నివేదిక ప్రభుత్వానికి సమర్పించనుంది ఆ తరువాత మార్చ్ 15 వ తేది తర్వాత DSC నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ఇటువంటి ఏపీ డీఎస్సీ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP Mega DSC 2025 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది పూర్తి వివరాలు”